మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.
tv-9 రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె tV-9 ఆఫిస్ కి ఒక ఫొన్ వెల్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.
ఇక మొదలు........
క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?
ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వ ప్న
ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నార?...క్రిష్ణ
స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విదం గ గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు
కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ
కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విదం గ కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప ్న
థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.
ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాతకుక్కలు-కుంటుడుఅంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..
బ్రేక్ తర్వాత..........
రజనికాంత్: చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసార? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.
కుక్కుటేశ్వర్ : ఈ విదం గ కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తం గ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లెదు.
రజనికాంత్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?
కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అనిDog's Medical Scienceలొ గట్టి ఆధారాలు ఉన్నాయి.
రజనికాంత్: తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.
క్రిష్ణ : (చెవిలొear pieceపెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)
క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?
రజిని ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.
కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...క్రిష్ణ
రజిని, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.
వంకర అంటె ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు రజిని మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)
రజిని వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చెతున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.
థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?
స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటి ర ధేడ్ దిమాగ్ గ. ఏమి మనిషివి ర నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టి మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ tV-9 office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)
(ఇలా తిడుతు ఉండగానె, tV-9 లోగొ వచ్చి, మెరుగైన సమాజం కొసం చుస్తూనే ఉండండి tV-9 అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)
Saturday, October 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment