తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూళ్లేక
భార్య : ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు.
భర్త : గంటసేపట్లో తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.
--------------------------------------------------------------------------
పొదుపరి భర్తతో తిప్పలు
భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.
భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.
--------------------------------------------------------------------------
అర్ధం కాని సినిమా
విజ్ఞాన్* : నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా.
జానీ : ఏం పాపం ఒక్కసారి చూస్తే అర్ధం కాదా.
--------------------------------------------------------------------------
అందంగా కన్పించాలని
రమేష్* : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్* : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...
--------------------------------------------------------------------------
ఐరన్* టానిక్*
భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్* టానిక్* వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..
--------------------------------------------------------------------------
రెండో ఆపిల్ పండు
రాజేష్ : న్యూటన్* ఆపిల్* పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.
గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
--------------------------------------------------------------------------
డ్రింకుమీద ప్రమాణం
గోపీ : ఇక మీదట డ్రింక్* ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.
రాము : అందుకే డ్రింక్*ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!
--------------------------------------------------------------------------
అతని పేరు ఏడుకొండలు
"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?"
"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు"
"సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"
--------------------------------------------------------------------------
ఇవాళ ఆలస్యమయ్యిందేం?
"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పాడు స్టూడెంట్...
--------------------------------------------------------------------------
కిలో నూనె ఎంతండీ?
"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత
"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి
"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?"
"ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ...
--------------------------------------------------------------------------
సార్ టైమెంతయింది?
"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్
"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్
"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్.
--------------------------------------------------------------------------
స్కూలులో ఎవరంటే ఇష్టం?
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకుని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్* కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.
--------------------------------------------------------------------------
వెయ్యి చీరలైనా...
భార్య : నేను టీవీ సీరియల్స్*లో నటిస్తానండీ.
భర్త : ఎందుకు
భార్య : మరి సీరియల్* పూర్తయ్యేలోగా వెయ్యి చీరలైనా కట్టుకోవచ్చండీ.
--------------------------------------------------------------------------
ఎవరు దూరం..
రాము : రేయ్ రాజూ.. నేనో ప్రశ్న అడుగుతా.. జవాబు చెప్పు..
రాజు : అలాగే..రాము : మనకు అమెరికా దూరమా.. సూర్యుడు దూరమా..
రాజు : అమెరికానే దూరం..
రాము : ఎలా చెప్పగలవు..
రాజు : ఏముంది.. మనం రోజూ సూర్యుణ్ణి చూడగలం కానీ.. అమెరికాను చూడలేం కదా.
--------------------------------------------------------------------------
ఇంగ్లీషులో చెప్పు తెలుగు
పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు
మాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..
విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..
మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..
విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..
మాస్టారు : ఆ ??!
--------------------------------------------------------------------------
రోగం తిరగబెట్టింది
తన పేషంటుకు ఫోన్ చేసాడు డాక్టర్...
డాక్టర్ : ఏమయ్యా.. ఇదేమైనా పద్దతిగా ఉందా..
పేషంట్ : విషయమేంటో చెప్పండి డాక్టర్ గారూ..
డాక్టర్ : ఫీజుగా నువ్విచ్చిన చెక్ బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది.. తెలుసా..
పేషంట్ : మరి క్రితంసారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్లీ తిరిగి వచ్చింది.. తెలుసా..
డాక్టర్ : ఆ ??!
--------------------------------------------------------------------------
మాజీ ప్రియుడు
ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.
బిచ్చగాడు: అమ్మా... కొంచెం దయ చూపించండి
ఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.
రెండో అమ్మాయి: (ఆశ్చర్యంగా అడిగింది...) ఏమే ఎందుకంత వేశావ్ ?
మొదటి అమ్మాయి: పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులే....
--------------------------------------------------------------------------
కాకి గోల
అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
సరిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
సరిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది
--------------------------------------------------------------------------
ఎంత భక్తి
"ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?" ప్రశ్నించాడు లెక్చరర్.
"అవును సార్. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో ‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’, ’ముక్తి’ లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్?" జవాబిచ్చాడో కొంటె కుర్రాడు.
--------------------------------------------------------------------------
తల నొప్పి
"నిన్న రాత్రి భయంకరమైన తల నొప్పితో బాధ పడ్డాను" చెప్పాడు నవీన్
"అవునవును. ఆ తలనొప్పి సినిమా హాల్లో నీ పక్క సీటులో కూర్చుని ఉంది కదా. నేను కూడా చూశాను." అన్నాడు రాము.
--------------------------------------------------------------------------
సిగ్గు
కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అరిచాడు.
"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.
--------------------------------------------------------------------------
ఏనుగు - చీమ
ప్రశ్న : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు??
జవాబు : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని
ప్రశ్న : ఒక ఏనుగు చీమ స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి ఏనుగు చచ్చిపోతుంది. కానీ చీమ బతికే ఉంటుంది? ఎందుకలాగ?
జవాబు: చీమ helmet పెట్టుకున్నది!!
--------------------------------------------------------------------------
జేబులు
"ఏంటయ్యా నా ప్యాంట్*కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు పోలీసు వేంకటస్వామి టైలర్*తో.
"పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు టైలర్.
--------------------------------------------------------------------------
Saturday, October 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment